"నీ జ్ఞాపకం నాతోనే "1980(ధారావాహిక 26,వ,బాగం)"నాగమణి రావులపాటి "
 ఆకాశంలో కమ్ముకున్న కారు మబ్బులు మెల్లమెల్లగా
తొలుగు తున్నాయి ఏమీ ఎరుగని దానిలా ఆకాశం
నిర్మలంగా వుంది అప్పుడప్పుడూ వచ్చిపోయే
మబ్బు తునకలు మినహా ఇంకే అలజడీ లేదు...!!
 కుసుమ నాన్నగారికి బందరులో చిన్న ఇల్లు వుంది
ఇక్కడ అద్దె ఇల్లు అందుకే బంధువులు కుసుమ
అమ్మా నాన్నలను అక్కడికే తీసుకు వెళ్ళి దహన
సంస్కారాలు చేసారు అందరూ అయ్యో పాపం
ఇప్పుడు ఎలాగ ఎలాగ బ్రతుకుతారు కుసుమ
పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే పాపం ఈ పిల్లలు
ఇద్దరూ అనాధలుగా మిగిలి పోతారు ఇలాంటి
మాటలు ఎవరికి తోచింది వాళ్ళు అనుకోవటం 
విని కుసుమ హృదయం తల్లడిల్లి పోయింది.....!!
నేను బ్రతికి వుండగా నా చెల్లికి తమ్ముడు కి ఎలాంటి
బాధా తెలియనీయను వాళ్ళు భవిష్యత్తే నా ఊపిరి
నేనే వాళ్ళకు అమ్మా నానై పెంచి పోషిస్తారు
అని తెగేసి చెప్పింది ...! వాళ్ళ గురించి జాలి పడటం
కుసుమ కు ఏమాత్రం ఇష్టం లేదు అమ్మా నాన్నలను
చూసి చెదిరిన వాళ్ళు మనసులకు నేనే కొండంత
అండి కావాలి అని మనసులో సంకల్పంచుకుంది...!!
తను అక్కడే వుండి బందువుల ద్వారా సామానులు
తెప్పించి ఇల్లు ఖాళీ చేయించింది తన ఉనికి గీతకు
కానీ గణేష్ కు కానీ రాహుల్ కు కానీ తెలియనీయక
పాత జీవితం తాలూకూ మధురిమలను స్నేహానికి
తిలోదకాలు ఇచ్చి  కొత్త జీవితానికి పునాది వేసింది
కుసుమ చితి మంటల్లో కట్టెలా కాలిపోతూ .....!!
వాళ్ళ నాన్నగారి తాలూకూ కొంత పైకం రాగా
ఒక్క రూపాయి కూడా వాడుకోకుండా చెల్లి తమ్ముడు
భవితకు అవసరం వచ్చినప్పుడు వాడుతాను
అనుకుని బ్యాంకులో పొందు పరిచింది......!!
తను నేర్చుకున్న టైప్ తనకు ఈ విధంగా ఉపయోగం
పడినందుకు తృప్తి పడుతూ ఒక ఆఫీస్ లో
టైపిష్ట్ గా చేరింది ఇంటవద్ద కొంత టైమ్ కేటాయించి
మిషను కుట్టేది చెల్లెలు కొంత సహాయం చేసేది.....!
 అప్పటికే చెల్లి పదవ తరగతి తమ్ముడు ఎనిమిది
చదువు తున్నారు తనలా కాకుండా వాళ్ళను
బాగా చదివించాలి మంచి భవిష్యత్తు వారికి
అందించాలి అని అహర్నిశలూ శ్రమిస్తూ పాటుపడే
కుసుమను మెచ్చుకోని వారు లేరంటే అతిశయోక్తి
కాదు అలా జీవనం సాగించే కుసుమ కనపడని
తన మనోవేదనని అనుక్షణం నెమరు వేస్తునే వుంది.!
రాహుల్ గుర్తురాని  క్షణం లేదు ఎలా వున్నాడో
తనంటే పిచ్చి ప్రేమ విధి వక్రించక పోతే తాను
ఈపాటికి రాహుల్ ను పెళ్ళి చేసుకుని వుండేదాన్ని
పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయాక ఈ సంఘటన
జరిగితే నిజంగానే తోడబుట్టిన వాళ్ళు ఏమై
పోయే వారో నన్ను రానిచ్చేవారు కాదు నేను
ఇటు రాలేక వాళ్ళను పట్టించుకునే వారు లేక
అమ్మో తలుచుకుంటేనే ఒళ్ళు జలతరిస్తోంది...!!
వీళ్ళకు న్యాయం చేసిన నేను నా ప్రాణానికి
ప్రాణమైన నాఊపిరినే వదిలి వచ్చాను.....!!
ఏవిషయాలు తనకు తెలియటం లేదు  రాహుల్
నన్ను క్షమించండి పరిస్థితులు నన్ను బంధించి
మీ దగ్గరకు రాలేక పోయాను కొన్నిరోజులు నన్ను
తిట్టుకోండి నాగురించి జాలి పడండి నేనేమై
పోయానో అని ఆందోళన చెందండి హాయిగా
ఎవరినైనా మంచి అమ్మాయిని చూసి పెళ్ళి
చేసుకోండి నన్ను తిట్టుకుంటూ అయినా నన్ను
రోజూ తలుచుకొండి ఏమూలో నాకు కొంచెం
జాగా ఇవ్వండి నేను నేను మాత్రం మిమ్మల్ని
కలలో కూడా మరువను నీతో కాని  నా  పెళ్ళి
ఇంకెవరితోనూ వద్దు నీవు పంచిన ప్రేమ
తాలూకూ తలపులన్నీ నాకు మధురమైనవే 
నా శ్వాసలో ప్రతీక్షణం"నీజ్జాపకం నాతోనే" ?(సశేషం)
.

కామెంట్‌లు