"నీజ్జాపకం నాతోనే"1980(ధారావాహిక,20,విభాగం)--" నాగమణి రావులపాటి "
 ఇంతలో పెళ్ళికూతురు వాళ్ళ అమ్మగారికి చెప్పటం
ఆవిడ కుసుమా వాళ్ళ అమ్మ కు చెప్పి ఒప్పించటం
క్షణాల్లో జరిగి పోయింది కుసుమ ఆనందానికి 
హద్దులు లేవు రాహుల్ ఎగిరి గంతేసినంత పని
చేసాడు...!
మనసు మురిసిన వేళ వయసు విరిసిన వేళ
ఆనందం హరివిలైనట్టు సంతొషాలన్నీ సుమాలై
చుక్కల దోసిలిలో విరియగా తారకలన్నీ
మేఘాల తేరుపై పూలవర్షం కురిసినట్టు ఉరుము లేని మెరుపు కల్యాణ తిలకం దిద్దినట్టు హృదయానంద డోలికలో వినీలాకాశంలో
మనసు పరవశించి విహరించి నట్టు
చెప్పలేని ఊసులన్నీ చెంత చేరి నిలిచనట్టు
పరిసరాలను మరిచి కళ్ళలో కళ్ళు పెట్టి
ఏదో లోకంలో విహరించే రాహుల్ కుసుమలను
తమ చప్ఫట్లతో మేలు కొలుపగా సిగ్గు
దొంతరలు మనసును ఆవహించగా ముసి ముసి
నవ్వులు మోముపై విరియగా వారితో వంత పలికపారిధ్దరూ...!
 
పెళ్ళి తంతు ముగిసింది అందరూ పెళ్ళి భోజనాలు
ముగించుకుని పిల్ల తరపు బంధువులు  తప్ప మిగిలిన వాళ్ళందరూ ఎవరి దారిన
వాళ్ళు వెళ్ళారు పెళ్ళి పిల్లవాడి తరపు బంధువులు
అప్పగింతలు కాగానే పెళ్ళి బస్ లోకి సర్దుకున్నారు
గులాబీలు తో అందంగా అలంకరించిన కారులో
ముందు సీటులో వధూవరులు ఆసీనులు కాగా
పెళ్ళి వధువు కుసుమ ను వెనుక సీటులో కూర్చోమంది కుసుమ వచ్చి కూర్చుంది కానీ
తన మనసంతా రాహుల్ పైనే వుంది తనకోసం
వొళ్ళంతా కళ్ళుచేసుకుని వెతికింది రాహుల్
ఎక్కడా కనిపించలేదు ఎక్కడ తిరుగుతున్నాడో
ఏమో నేను వచ్చేది తనకోసమే కదా ఇంతలో
ఎక్కడికి మాయమయినాడో ఏమో దేబ్బెం
మొహం తనకోసం  నేనింత  కంగారు పడుతుంటే
తనకు చీము కుట్టినట్టు కూడా లేదు బహుశా
పెళ్ళి. బస్ లో వస్తాడేమో ఏవిషయం నాకు చెప్పొచ్చు కదా నా పక్కన ఎవరు కూర్చుంటారో ఏమో అని పరి పరి విధాలా ఆలోచిస్తూ మౌన
ముద్ర వేసింది కళ్ళుమాత్రం రాహుల్ కోసం అన్వేషిస్తూనే వున్నాయి ...!
కుసుమ మౌనాన్ని చూసిన స్నేహితురాలు ఏమిటే
సైలెంట్ అయ్యావు అని అన్నది ఏమీ లేదులేవే
మీ అత్తగారి ఊరు ఎంతదూరం అని అడిగింది
 కుసుమ 200,కి,మీ,ఉంటుందే అని అనగానే
చాలా దూరమే వెళ్శేసరికి తెల్లారి పోతుంది అని అన్నది కుసుమ అనగానే మళ్ళీ మౌనం
రాజ్య మేలింది ఇంతలో దూరంనుంచి రాహుల్
కనిపించాడు ఎడారిలో వున్నవారికి నీటిబొట్టు
దొరికినట్టయింది కుసుమకు ఇటే వస్తున్నాడు..‌!
ఫ్రెండ్స్ తో మాట్లాడతాడేమో అని అనుకుంది కుసుమ డోర్ ఓపెన్ చేస్తుంటే నాతో ఏమన్నా
మాట్లాడతాడేమో అనుకుంది తన అంచనా
తారుమారు చేస్తూ వచ్చి కుసుమ పక్కనే
కూర్చున్నాడు సరే కార్ బయలు దేరటానికి టైమ్ వుందేమో ఈ కాస్త సమయం నాతో గడపాలని 
వచ్చినట్టున్నాడు ఎవరన్నా చూస్తే అమ్మో అని
అనుకుంటుండగానే అన్నా ఇక కారు స్టార్ట్ చేయి
అని పెళ్ళికొడుకు అనగానే అలాగే సార్ అంటూ 
డ్రైవర్ కారు స్టార్ట్ చేయటం ఏమిట్రా ఇంతలేట్
చేసావు నీకోసమే వెయిటింగ్ అని అనేసరికి
సారీరా నేను మీతో వస్తున్నట్టు ఇంట్లో తెలియదు
కంగారు పడతారు అందుకే  గేట్ బయట
నిలుచున్నా ఎవరయినా తెలిసిన వాళ్ళు
కనిపిస్తారేమో అని లక్కీగా మాఇంటి పక్కతను
కనిపిస్తే మా ఇంట్లొ  చెప్పమని చెప్పి వచ్చేసరికి ఆలస్యం అయింది అని అన్నాడు రాహుల్...!
వాళ్ళు సంభాషణ విని అవాక్కయింది కుసుమ
ఛీ అనవసరంగా రాహుల్ ను అపార్దం చేసుకన్నా అని కుసుమ వాపొయింది కుసుమ గారూ
 మీకు తెలియదు కదా మీఇద్దరూ మాతో
జర్నీ చేయాలని మేమే కష్టపడి ప్లాన్ చేసాం
మీ ఇద్దరూ మాకు ఇంపార్టెంట్ వ్యక్తులు
మీరు నా భార్యకు ఫ్రెండ్ అలాగే వీడు నా ఫ్రెండ్
మీ ఇద్దరూ మాతో కలిసి జర్నీ చేస్తే మాఇద్దరి కీ ఆనందం ఏమంటావు డియర్ అని భార్యను
అడగ్గానే నేనేమంటాను మీరేమంటే నేనూ అదేఅని అనేసరికి అందరూ నవ్వుకున్నారు?( సశేషం)
తరువాత బాగం రేపే...!!

కామెంట్‌లు