కడుపు ఉబ్బరం, అజీర్ణము -2; పి . కమలాకర్ రావు
 అజీర్తి, కడుపు ఉబ్బరం సమస్యలు
తగ్గాలంటే కొన్ని ఆహారపు అలవాట్లను పాటించాలి. భోజనానికి 20 నిముషాల ముందు
కొద్దిగా మంచి నీరు త్రాగి చూడండి.
కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
కొన్ని పూ దీన  ఆకులను కడిగి
రసం తీసి నిమ్మ రసం తేనె కలిపి త్రాగితే పొట్టలోని వాయువు వెంటనే బయటకు పోతుంది.
ఉబ్బరం తగ్గు తుంది.
ప్రతి రోజు ఉదయం అల్లం ముక్కకు సైన్ధవ లవణం అద్దు కొని
తింటే కడుపు ఉబ్బరం రాదు.
అజీర్తి తగ్గడానికి, కొద్దిగా కరక్కాయ పొడిలో అంతే మోతాదులో సైన్ధవ లవణం
కలిపి గోరువెచ్చని నీటితో
త్రాగాలి. వరుసగా కొద్ది రోజులు
చేస్తే అజీర్తి సమస్య పూర్తిగా తొలగి
పోతుంది.

కామెంట్‌లు