"రంజాన్ పండుగ-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్-సిద్ధిపేట-చరవాణి:- 6300474467
 01.
సీ.
అతిపవిత్రముగానుఅల్లానుపూజించి
ఉపవాసదీక్షలనుండుచుండి
దానధర్మమ్ములదయతోడజేయుచు
ఆఖురాన్గ్రంథమునంతచదివి
నెలరోజులింటిలోనియమముగనమాజు
నైదుమారులుజేసిమోదమలర
ఐకమత్యముమెండునన్నదమ్ములవోలె
కలిసిమెలిసియుండివిలసితముగ
(తే.గీ.)
"షెహరి""యిఫ్తారు"లనుజేసిసహనముగను
సతమునాప్యాయతలతోడసమ్మతముగ
నీద్ముబారకుననుచునునీధరిత్రి
జరుపుకొందురు"రంజాను"శక్తికొలది
ముస్లిములపర్వదినమిదిముద్దుగొల్పు!!!

కామెంట్‌లు