"ఆరోగ్యమేమహాభాగ్యము-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--చరవాణి:- 6300474467
 01.
తే.గీ.
కూరగాయలు,పప్పులుకుదురుగాను
ఆకుకూరలు,పండ్లనునమితముగను
తినగనారోగ్యభాగ్యమ్ముమనకుదక్కు
పోషకాలవియందించుపుష్టిగాను!!!

02.
తే.గీ.
యోగసాధనవల్లనురోగములిల
దరికిజేరకమనలనునిరతముగను
కంటికినిరెప్పవోలెనుకాచుచుండి
అందజేయునుసుఖమునానందముగను!!!

03.
తే.గీ.
తక్కువగవాడవలెగాదెనిక్కముగను
కూరలందునయుప్పునుకారములను
పెరుగు,చల్లనుతీసుకోమరువకుండ
నిమ్మరసమునుసేవించునిమ్మలముగ!!!

కామెంట్‌లు