అనాథబాలలు-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--చరవాణి :- 6300474467
 01.
సీ.
అమ్మనాన్నలులేకనాకలికేడ్చియు
బాధలనొందుచుబ్రతుకుచుండు
చదువుకుదూరమైముదముకుదూరమై
బాధలనొందుచుబ్రతుకుచుండు
దిక్కుతోచనిస్థితిదినదినగండమ్ము
బాధలనొందుచుబ్రతుకుచుండు
నేబంధమన్నదియేమియులేకను
బాధలనొందుచుబ్రతుకుచుండు
(తే.గీ.)
ఆయనాథబాలలజూచియాదుకొనుచు
చేతనైనంతసాయముచేయవలెను
ప్రభుతపట్టించుకొనివీరిపట్లతగిన
శ్రద్ధబూనియుఫలితమ్ముసలుపవలెను!!!


కామెంట్‌లు