"శ్రీలక్ష్మీనరసింహస్వామిస్తుతి-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--చరవాణి:- 6300474467
 01.

సీ.
నరసింహనీదివ్యనామమ్ముజపియింతు
నాపైనకోపమ్ముచూపబోకు
ప్రహ్లాదుబ్రోచినపగిదిగానన్నును
దాసుగానుండనీదనుజహారి
ముప్పులదప్పించు,ముక్తినియిప్పించు
నీపాదసేవలునేనుజేతు
నీపేదరికమునుశాపమైభరియించు
చుంటినినన్నొకకంటజూడు
(తే.గీ.)
బంధములనేర్పరచినావుపాపనాశ
నాదుబాధలుబాపుమునాగశయన
లీలలనుజూపినరహరిశ్రీలనొసగు
లోకములనేలుచుండెడిశోకనాశ!!!


కామెంట్‌లు