వేటూరిసుందరరామమూర్తి వర్థంతి-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్;--చరవాణి:- 6300474467
 01.
కం.
వేటూరీ!వేటూరీ!
పాటలపూదోటయతడు,భారతిసుతుడున్
మీటియుమనహృదయాలను
ధాటిగపదగుంఫనములుధారగనొసగెన్!!!
02.
కం.
పాటకుప్రాణముబోసెను
పాటకుసరిక్రొత్తశైలి;పైటనమర్చెన్
పాటకుభాష్యమునిచ్చెను
పాటకురససృష్టిజేసిపరమార్థమిడెన్!!!
03.
కం.
ఎన్నోచిత్రములకుతా
నెన్నోపాటలురచించెనీప్సితమొప్ప
న్నెన్నోతీరులసుమధుర
మెన్నోగీతాలుకూర్చియిచ్చెముదంబున్!!!


కామెంట్‌లు