"మాతృదినోత్సవము-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్చరవాణి:- 6300474467
 01.
సీ.
ఎవ్వరేమిచ్చినాయెంగిలిజేయక
కొంగుచాటునదెచ్చికుడువబెట్టి
జ్వరమునాకున్నచోజాగరణముజేసి
పత్యంబునీవుండిస్వస్థపరచి
గాయంబునాకైనకన్నీరునువుగార్చి
కంటికిరెప్పవైవెంటనుండి
పస్తులునీవుండిపాలనునాకిచ్చి
దీర్ఘాయురస్తనిదీవెనొసగి
(తే.గీ.)
నాల్గుమాటలునేర్పించి,నడతనేర్పి
తోలుబొమ్మనుసంఘజీవాలయమున
మనిషిగానిల్పినట్టినీమమతకేను
వందనముజేతునమ్మనీపదములంటి!!!


కామెంట్‌లు