దాశరథి రంగాచార్య మణిపూసలు ;-చైతన్య భారతి పోతుల 7013264464
 160.
తెలంగాణ పోరాటము
నవలలతో వైశిష్ట్యము
వేదముల ననువదించిన 
దాశరథిదె గొప్పదనము
161.
రైతాంగ పోరాటాలు
రచనలకు నేపత్యాలు
ఎన్నో బహుమానాలతొ 
ఘనమే రంగాచార్యులు
162.
తెలంగాణా చరిత్రము
మహోజ్వల వారసత్వము
నిజాం నిరంకుశత్వాన్ని 
అతని నవలలో లిఖితము
163.
జనపద ఇతివృత్తము
సమాజ ప్రతి బింబము
రంగాచార్యులు రచనలు 
ఘనమైన సాహిత్యము
164.
పాత్రోచిత యాసలను
వారు ప్రవేశ పెట్టెను
ప్రసిద్దిగా నిలిచాడు 
గద్య దాశరథి గాను
165.
దాశరథి జీవితము
అందరికాదర్శము
ప్రతిఫలం ఆశించక 
బాధ్యత నిర్వహణము
166.
ఘనమైన వారసత్వము
తెలంగాణకే సొంతము
అధ్యయనము చేయాలి. 
దాశరథీ సాహిత్యము
167.
తెలంగాణలో వీరులు
రంగాచార్య సోదరులు
గొప్ప  సేవలందించె 
అన్న కృష్ణమాచార్యులు
168
సాంస్కృతిక వైభవము
జీవన పోరాటము
తరాల వారసత్వాన్ని 
రచనల సారాంశము 
169.
ఎందరో వీరులు కవులు
తెలంగాణలో ధీరులు
మన స్ఫూర్తి దాతలైన 
దాశరథికి వందనములు

కామెంట్‌లు