మణిపూసలు ;-చైతన్య-7013264464
ధనం జూసి పెట్టేరు 
బహుళ దండాలు వారు 
గుణహీనులై జనాలు 
గుణములనెవరు గానరు 

స్వార్థంలో మునిగారు 
సేవలనే మరిచారు 
అందినది దోచుకొని 
ఎరుగనట్లు ఉండేరు 

సత్యమెళ్లి దాక్కుంది 
వెతికినా దొరకనంది 
స్వార్థపరుల చెరనుండి 
తప్పించుకు వెళ్ళింది 

అబద్దాలు చెబుతుండు 
అందినది దోచుకుండు 
భగవంతుని మభ్యపెట్ట
హుండీలో వేస్తుండు. 

దానధర్మం అంటుండు 
పూజల్లో మునిగిండు 
భక్తిపేరు చెప్పుకుంటూ 
తప్పతాగి ఎగురుతుండు 

అందరు జూడాలంట
కీర్తి భజన తనకంట
నలుగురిలో గొప్పగాను 
పేరుకయి పాకులాట 

ఊపిరి పోయినాక 
చిరునామా లేదిక 
ఊరిబయట పాతేస్తరు 
వెంటరాదు ఏమిక 

అభాగ్యుల జీవితాన 
మానవతను కాస్తయిన
కరుణ తోడ జూపాలి. 
సంతృప్తి కొరకైన 


కామెంట్‌లు