అష్టాంగ మార్గం (మణిపూసలు );-పి. చైతన్య భారతి -7013264464
పరమ శాంతి కాముకుడు.
దివ్యమైన గౌతముడు.
చరిత్ర గతిని మార్చిన, 
పరిపూర్ణ చైతన్యుడు. 

వజ్రవైడూర్యాలు 
రథాలు, పల్లకీలు 
చక్రవర్తి కుమారునికి  
తులతూగు సంపదలు. 

తృణప్రాయంగ నతడు 
అన్నీ వదిలేశాడు. 
నిరాడంబరుడై తాను 
భిక్షాటన చేసాడు. 

ముప్పై ఏళ్ళకు పొందెను. 
దివ్యజ్ఞాన సంపదను. 
వేల మైళ్ళు గౌతముడు, 
కాలినడకన తిరిగెను. 

దుఃఖనివారణ మార్గం. 
అష్టాంగ యోగా మార్గం.
మానవాళికి శాశ్వత, 
శాంతి తోవనే స్వర్గం. 

ఆదిలోన సిద్ధార్థుడు, 
సాధనతోనే బుద్ధుడు. 
జనన మరణాలు జరిగే 
వైశాఖ పూర్ణిమనాడు. 

ఒకరోజూ భగవానుని 
చేస్తున్న భిక్షాటనని 
రుసరుసలాడుతు మహిళ 
తిట్టిపోసే సోమరివని.

చిరునవ్వుతో గౌతముడు, 
పరుష వాక్కులు విన్నాడు.
ఆ మహిళకే వదిలేసి, 
స్వీకరించను అన్నాడు.

సిగ్గుతోన ఆ మహిళను, 
ఆలోచనలో పడవేసెను.
గాయపరచక విమర్శలు, 
కదిలింపజేయాలనెను.

అత్యుత్తమమైన దారి 
అందరి మేలైన దారి 
శ్వాస మీద ధ్యాసతో 
జ్ఞానోదయానికి దారి. (189-198)


కామెంట్‌లు