జీవిత సారం...;- ప్రమోద్ ఆవంచ- 7013272452
వెలుగు నీడల పగలు రాత్రులతో,పలుకరించే
ఆకాశం,పరవశించే ఈ దేహం.
పున్నమో! అమావాస్యో! వాకిలంతా
 పరుచుకుంది.
 జీవితపు సజీవ పార్శ్వాలను తాకుతుంది సత్యం
 నిద్రపోతున్న విశ్వానికి పగలైనా, చీకటైనా
 ఒక్కటే!
అభినయమే అస్థిత్వం, ప్రపంచమనే నటనాలయం
నా చుట్టూతా!
పొలంలో చేరిన పురుగు పంటనంతా నాశనం
చేస్తుంది.
పలుగు పారలు,సానబెట్టి కుళ్ళునంతా
 కుళ్ళబొడిస్తే..
 కలుగు సందుల్లోంచి మెల్లగా జారిపోయింది
 జీవితం!
 పులి తరుముతుంది జింక పరిగెడుతుంది
 తరతరాలుగా ఇదే తంతు!
 అసహాయ స్థితి ఒక పద్మవ్యూహం అయ్యింది.
 కోల్పోయిన వెలుగును వీధుల్లో తిరుగుతూ
 చీకట్లో వెతుక్కుంటుంది ఓ మనసు!
 కాలువ తెగింది, కలువ విస్తుపోయింది, విలువ
 ప్రశ్నిస్తుంది.
 సమస్యల ముడులు విప్పే ప్రయత్నంలో 
 విలువ జీవిత సారం
 గమనం ఒక విశ్వాసం
 వెలుగు ఒక గమ్యం.....
                            

కామెంట్‌లు