*నారదుడు కోపముతో విష్ణుభగవానుని దూషించి శపించుట - శివమాయ నుండి విడివడి నారాయణుని పాదముల మీద పడుట - మనసును శుద్ధి చేసుకునే ఉపాయము అడుగుట - శివ మాహాత్మ్యము ను తెలుసుకొనుటకు బ్రహ్మ వద్దకు వెళ్ళమని ఆదేశించి, శివుని భజించు ఉపదోశము నొసగుట*
*శివ పార్షదులను శపించిన తరువాత విష్ణుదేవుడు తనకు చేసిన మోసమును పదే పదే తలచుకుంటూ, శ్రీమతి తనకు దక్కలేదు అనే విషయం మరచిపోలేక, నారదుడు లక్ష్మీ పతి మీద విపరీతంగా క్రోధం పెంచుకున్నాడు. రగులుతున్న అగ్నికణాలు లాగా వున్న కళ్ళతో, దుస్సహమైన కోపాన్ని ప్రదర్శిస్తూ, తన జ్ఞానాన్ని పూర్తిగా కోల్పోయి, వ్యంగ్యంగా సూటి పోటి మాటలు మాట్లాడుతున్నాడు.*
*ఓ విష్ణూ! నీవు పరమ మోసకారివి. నీవు చేసే కార్యాలు అన్నీ, మోసముతో నిండినవిగానే వుంటాయి. నీవు ఇతరులలో వున్న ఉత్సాహాన్ని, గొప్పతనాన్ని ఓర్చుకోలేవు. నీవు సాగర మధనం సమయంలో రాక్షసులను మోసము చేసి అమృతానికి బదులు వారుణీ మదిరను త్రాగించావు. నీకు ఎల్లప్పుడూ మోసం, కపటముల మీదే ప్రేమ ఎక్కువగా వుంటుంది. మహాశివుడు తన గొప్పతనం వల్ల విషం తాగి నీకు లక్ష్మీ దేవిని ఇవ్వడంతో నీవు గొప్ప వాడివి అయ్యావు. అప్పుడు కనుక శివుడు విషం త్రాగకపోతే, నీ మాయ ఆనాడే అంతం అయి వుండేది. నీ స్వభావము ఎప్పుడూ మంచిది కాదు. అయినా శివ భగవానుడు నిన్ను సర్వ స్వతంత్రునిగా చేసాడు. ఇప్పుడు నీవు చూపుతున్న కపటత్వాన్ని చూసి శివుడు కూడా బాధపడుతూ వుంటాడు. ఓ విష్ణూ! నీకు ఇప్పటి వరకూ సరైన బ్రహ్మణోత్తముడు తగలలేదు. కానీ ఇప్పుడు నేను వచ్చాను, ఇక నీ ఆటలు సాగవు.*
*నీవు నాకు నేను ఎంతో ఇష్టపడే శ్రీమతి ని దక్కకుండా చేసి, స్త్రీ కోసం నేను బాధపడేటట్టు చేసావు. అందుకే భవిష్యత్తులో నీవు భార్యా వియోగం అనుభవిస్తూ, స్త్రీ కోసం బాధపడుతూ ఆమెను వెతుక్కుంటూ వుంటావు. నాకు కోతి ముఖాన్ని ఇచ్చావు కదా! అందువల్ల అలా కోతి ముఖం వున్న వారి సహాయం తోనే నువ్వు నీ స్త్రీ ని కలవగలుగుతావు.*
*శివ మాయా మోహితుడైన నారదుడు ఈ విధంగా నారాయణుని దుర్భాషలాడుతూ, శపిస్తాడు నారదమహర్షి.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి