హైకూలు;----కయ్యూరు బాలసుబ్రమణ్యం  7780277240-శ్రీకాళహస్తి
ఆ సరస్సున
వలస పక్షులతో
ఇంధ్ర ధనస్సు

రహదారిన
రంగుల పూల వర్షం
హోళీ పండుగ

వేల పక్షులు
ఊరిని నిద్ర లేపాయ్ 
ఉదయ సంధ్య

ఆకాశమున
రంగుల విహంగాలు
గాలి పటాలు


కామెంట్‌లు