పక్షుల మెరుపులు;-రాసమొళ్ల చంద్రయ్య--అప్పాయపల్లి నాగర్‌కర్నూల్ జిల్లా--7981781349
మైనంపిట్ట మాటలు
బంగారు పూలతోటలే
పాలపిట్ట పలుకులు
పైరుపాల జొన్నకంకులే

కోయిలమ్మ పాటలు
కర్ణభేరిలకు విందులే
చిలకమ్మ ముక్కులు
దొండపండు చాయలే

నెమలికాళ్ల అందెలు
ఘల్లుఘల్లున మోతలే
అడవితల్లి సంతోషాలు
నేత్రాలకును విందులే

చెరువువొడిలో కొంగలు
కూటికోసం పాడునిందలే
నీటిపిట్టల వింతిఈతలు
పరుగుపంద్యాల విజయాలే

సార్వలు పెద్దబోదలు
గోరెంకలు ఊరవిస్కలే
నరదిష్టితో స్వేచ్ఛాజీవులు
హంతమాయెను పక్షిజాతులే


కామెంట్‌లు