నల్లమల్ల వంటినిండ
సిరిచందన వనము
ఆతల్లి మనసునిండ
సుగంధాల ద్రవ్యము
కొండనిండ వృక్షరాసులు
గిరిశిరస్సుల కిరిటాలే
పారేవాగులు వంకలు
ఆతల్లిమెడల హారాలే
ప్రతిఒక లొంకలోయలో
పవిత్రపుణ్య తీర్థము
మహిమల ఆమట్టిలో
దొరుకు ఆరోగ్యప్రసాదము
అడవిబిడ్డల ఆకలితీర్చే
దేవదారివనం సంజీవము
వారిబ్రతుకులో శక్తినిచేర్చే
పలసంపద భాద్యతేనిత్యము
మార్పుడు తీగలనిండ
వానరులూగే ఊయల
పక్షులు ప్రకృతినిండ
గాలిలోఆడే జంపాల
గుహలలో మృగరాజులు
జంతువులు అడవిలోబ్రతుకు
వాటికిస్వేచ్చ నిలయాలు
అరణ్యం మూగజీవులకు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి