సాహిత్య దిక్సూచి;--నెల్లుట్ల సునీత--ఖమ్మం7989460657
తెలుగు సారస్వత దశను దిశను మార్చి
సంప్రదాయ కవిత్వం ని దిక్కరించి
తెలుగు సాహిత్యాన్ని శాసించి
విప్లవ కవిగా వినతి కెక్కి
గురుజాడ 
అడుగుజాడల్లో సామాజిక వాస్తవికతకు
 దర్పణం పట్టాడు

వాడుక భాషకు పట్టం గట్టి
నవ్యతకు నాంది పలికి
  ప్రాసలకు ప్రాణంపోసి
శ్లేషలతో చమత్కరిస్తూ అల్పాక్షరాల్లో 
అనల్పార్ధాన్ని సృష్టించిన
 కవిబ్రహ్మ

పేదల కోసం సిద్ధాంతాలను రక్త నిష్టలో రంగరించుకున్న  నైజం
అభ్యుదయ భావాలను ఝులి పించిన ప్రజాకవి
కర్తవ్య బోధన సందేశం అందిస్తూ వెలుగెత్తి చాటిన మహాకవి

వెండితెర గుమ్మాలకు
 పాటల తోరణాలు కట్టిన ఆణిముత్యం
జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వైతాళికుడు
సగటు మనిషి బాధల్ని
 రచనలుగా మలచిన యుగకర్త
తెలుగు సాహిత్యానికే దిక్సూచి
మన శ్రీ శ్రీ

కామెంట్‌లు