గజల్;-నెల్లుట్ల సునీత- ఖమ్మం-చరవాణి 7989460657
చందమామ తేరుపైన నిలవాలని ఉన్నదిలే!!
భూమిచేరు చినుకులాగ కురవాలని ఉన్నదిలే !!

బరువైన గుండెలోని బాధ దాచుకుంటు 
గొప్పదైన ఆశయమై కదలాలని ఉన్నదిలే!!


పరుగులెత్తు రుధిర భావాలను నింపుకుంటు
చైతన్యపు కవనమై సాగాలని ఉన్నదిలే !!

ఉరకలెత్తు పయనానికి ఉత్సాహము నిచ్చి
అనునిత్యం ఓ ప్రేరణ నింపాలని ఉన్నదిలే !!

సూక్తులతో గజలెన్నో రాయాలని ఆశ
సునీతకు తరంగమై తాకాలని ఉన్నదిలే !!కామెంట్‌లు