*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ప్రథమ (సృష్టి) ఖండము - (౮౦ - 80)*
 *మహాప్రళయకాలమందు కేవలము సద్బ్రహ్మయొక్క శక్తిని ప్రతపాదించుట - నిర్గుణ నిరాకార బ్రహ్మచేత యీశ్వరమూర్తి ప్రాకట్యము - సదాశివుని ద్వారా స్వరూపభూతశక్తి ప్రాకట్యము - వీరి ద్వారా ఉత్తమక్షేత్రమైన కాశీ లేక ఆనందవనము ప్రాదుర్భావము - శివుని వామాంగము నుండి విష్ణువు ఆవిర్భావము - వర్ణన*
*ఈ "సత్" ను యోగులు తమ హృదయములో ఎల్లప్పుడూ దర్శించు కుంటూ వుంటారు. పరబ్రహ్మము గురించి జ్ఞానము లేక అజ్ఞానముతో పరి పరి విధాల ఆలోచన చేస్తూ ఏదేదో మాట్లాడుతున్నారు. సృష్టి చేయాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు ఒకటే అనేకమగునట్లుగా సంకల్పించాడు, పరమాత్మ. నిరాకారుడైన పరమాత్మ తన లీలా శక్తి చేత శివ మూర్తిని, శివదేవుడుగా ప్రకటితమయ్యాడు. అలా ప్రకటితమైన శివ మూర్తి, అన్ని ఐశ్వర్యములు ఇవ్వగలది. సర్వజ్ఞాన మయము, శుభ స్వరూపము, సర్వ వ్యాప్తము, అన్ని రూపములు తనవే. అన్నిటిలోనూ వుండేది తనే. అన్నిటికీ ముందుగా వున్నది, అన్ని కోరికలూ తీర్చేది, అందరిచేత నమస్కరింప బడేది అయినది ఈ శివ రూపము. ఈ శివ రూపమే మొట్టమొదట వున్నది, అనంతమైనది, అన్నిటా వ్యాపించి వున్నది, అందరికీ వెలుగులు పంచేది కూడా ఈ శివ రూపమే. ఇలాంటి శివ రూపము ప్రకటితమైన తరువాత, చిన్మయము, సర్వవ్యాపి అవినాశి అగు పరబ్రహ్మ అంతర్హితుడు అయ్యాడు. ఆకారరహితమైన పరబ్రహ్మము యొక్క రూపమే సదాశివుడు. ప్రాచీన విద్వాంసులు, పండితులు, జ్ఞానులు ఈ సదాశివుణ్ణి "ఈశ్వరుడు" గా పిలిచి కొలిచేవారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు