జానపద గీతం;-మమత ఐల-కరీంనగర్9247593432
ఈ వాంతులేమిట్రా బాబు 🙆‍♂️
తాగకురన్నా
తాగి వాగకురన్నా //2తాగకు//

పనిపాటలు మరచిపోయి
పంతాలకు తాగుతుంటే.....
వాంతిగాక ఏమైతది 
వద్దంటే వినవేరా....//2తాగకు//

 పనిజేత్తే పైసలచ్చె
వాటితోనె అన్నమచ్చె
పక్కొని బుర్ర కొరకు
ముచ్చట్లకు మూతేంట్రా....//2తాగకు//

 బుర్రదింటె నిండునట్ర
గొర్రెల వలె నడకేంట్రా
నీతి ఖ్యాతి లేకుంటే
దెబ్బతిందు వోరయ్యా!...//2తాగకు//

 మితిమీరిన మంచి వద్దు
గింత గూడ చెడువద్దు
చిల్లర పని కొంత ముద్దు
బుద్దేగద సరిహద్దూ.....//2తాగకు//

అవసారానికాయుధాలు
బుర్రలోనె పొందుపరుచు
కనిపించని దర్జాతో
కదులుర విజయం పొద్దూ.....//2తాగకు//కామెంట్‌లు