అష్టావధానం లోని అంశాలు;-మమత.ఐల-కరీంనగర్ 9247593432
 1.సమస్యాపూరణం
విస్మయమేల చందురుడు వేళకు వచ్చిన ధన్యమే గదా
భస్మము మెచ్చెడీశ్వరుడు బాధలు బాపెడి దైవమే గదా
తస్మియ తోడ జ్ఞానమును ధర్మము నెంచుక బోధచేయగన్
క్రిస్మసునాడు పుట్టెనట కృష్ణుడు లోకములెల్ల మెచ్చగన్
2.దత్థపది
ముక్తి భక్తి ముక్తి భుక్తి
పరోపకారం గురించి
ముక్తికి మార్గము వెతకచు
భక్తిగ నుపకారసేవ పరులకు జేయన్
ముక్తిదొరకుటే గాకను
భుక్తికి రక్షణను గూర్చు భువిలో దైవమ్

3.నిషిద్ధాక్షరి
క.చ.అక్షరాలను నిషేధిస్తూ వేసవి
సెలవులలో పిల్లలకు కలిగే ఆనందాన్ని వివరించండి
ఆటలందు మునిగి నీటిలో నీదెడి
సాహసాల ఘనుల వాహనాలు
పొద్దుటెండగనరు ముద్దైన బాలలు
పాఠశాల విడుపు పండగేను
4.న్యస్తాక్షరి
1పాదంలో 1..అక్షరం.పై
2పాదంలో  4..  అక్షరం..దా
3పాదంలో 5 అక్షరం....కే
4పాదంలో 7..అక్షరం ..రూ
*పై* రు పచ్చగా పెరిగినన్ వరముగాద
రైతు గో *దా* ము నిండగన్ రాజుగాడ
పుణ్య జీవి *కే* జీవిగాపుష్టి నొసగ
చెమట చిందిచెడీ *రూ* పుశివుడు గాద 
5.వర్ణన
మండు వేసవిలో పదవతరగతి ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు సిద్ధఫడుతూ పడుతున్న ఇబ్బందులు
కంట కునుకు లేక తంటాలబడుకుంటు
నెండ తీవ్రతరము మండుచుండ
పరుగు లెత్తి రాయ సురరాయ బాలురు
నిలచివుందు రకట కలవరముగ
6.ఆశువు
డెబ్బై ఐదు సంవత్సరాలలోభా రతదేశం పొందిన ప్రగతిని గురించి తెలపండి
హద్దు గీసిన రాజ్యాంగ హయముతోడ
సద్దుమణిగిన సమరంబు సంస్కృతెంచి
విద్య లధికమై ప్రగతికి విలువ నొసగి
సార్థకత చెందె భరతభూస్వామ్య మిపుడు
7.అంత్యాద్యక్షరి
మూలము నెరిగిన గాలము
నేలన మొలకెత్తు మొక్క నెప్పటికైనన్
వాలము వోలెన్ గావవ
బేలతనమువిడువ కీడువిధిమాయంబౌ
8.ఛందోభాషణం
*మాయజగములోన మహిమలు జూపంగ*
 నాస్తికత్వమెపుడు నరులు మెచ్చి
మానవత్వమంత మనిషిలో నశియించి
సమత మాయమౌను జగతిలోన
*మాయ జగములోన మహిమలు జూపంగ*
రాణి వాసమచ్చి రాజ్యమేలు
నీరు పల్లమెరిగి నిజము దేవుడెరుగ
గుడ్డి మెల్ల కెపుడునడ్డురావె

కామెంట్‌లు