మాతృ దినోత్సవం సందర్భంగా;-మమత ఐలకరీంనగర్9247593432
 క.
ఎల్లరు ప్రణమిల్లేందుకు
తల్లికి నొకరోజునిచ్చు తరుణంబేలన్
యెల్లప్పుడు మ్రొక్కినగని
తల్లి రుణము దీర్చగలర ధరణిన మనసా!
క.
కల్లా కపటం తెలియక
పిల్లలె సర్వస్వమనుచు పెంచిన హృదికిన్
చిల్లులు పొడవక ప్రేమను
తల్లికినందించచాలు ధన్యులు మనసా!

కామెంట్‌లు