కళ్ళలో ఆశ నింపుకుని అరుస్తున్నాడువాడు
పాత వస్తువులు,పేపర్లు,పుస్తకాలు కొంటానని
వాడిది తీపి అరుపు నాకు!
ఎవరికి తెలుసు ఒక అపురూప పుస్తకమో,
ఏ జమీందారు ఇత్తడి పళ్ళెమో
ఏమో అల్లా ఉద్దీన్ అధ్బుత దీపమో
అలనాటి పత్రికో,ఏ నవాబు వస్తువో
నాకు దొరుకుతాయేమో
ఎవరికి తెలుసు వాడు తెచ్చే అపూర్వ
సంపదో, పాత గ్రామఫోను రికార్డో!
ఎవరేంచెప్పగలరు?
అందుకే వాడి తీపి కేక వినబడి నపుడు
కళ్ళింత చేసి ఆశగా వాడి బండి
వైపు చూస్తుంటాను!
*********
తీపి అరుపు;-కంచనపల్లి వేంకట కృష్ణారావు 9348611445
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి