కవి మెదడులో ఉదయించిన
ఒక ఆలోచనకు
అక్షర రూపం కదిలిస్తుంది
కోటి మెదళ్ళను.
ఒక రచయిత వ్రాసిన
అక్షరాల కలయిక వాక్యం
ఇస్తుంది ఆనందం,ఆలోచన
అక్షరాలు ప్రేమించే
పాఠకుడికి వేదమయినా,
భారతమయినా,భగవద్గీత అయినా
అక్షరాల కలయిక వెలుగుల దారి
చూపిస్తాయి!
అక్షరాల కలయికతో మనిషి మెదడుకు శక్తి
ఒక అక్షరం మరొక అక్షరంతో కలవాలని
తన బతుకుకు ఒక అర్థం
కావాలని కలలు కంటోంది
తరచి చూడండి
చదివి చూడండి!
********
అక్షరం కల;-కంచనపల్లి వేంకట కృష్ణారావు 9348611445
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి