పువ్వు -నవ్వు;-రావిపల్లి వాసుదేవరావు-పార్వతీపురం-పార్వతీపురం మన్యం జిల్లా--9441713136
బంతి తోని ఆడితే 
బంతి పువ్వు నవ్వింది

మంచి మాట పలికితే
మల్లి పువ్వు నవ్వింది

జాలిగుణం చూపితే
జాజి పువ్వు నవ్వింది

మేలు చేసి చూపితే
మందారం నవ్వింది

చెడ్డ పనులు ఆపితే
చామంతి నవ్వింది

గీతం నే పాడితే
గులాబీ నవ్వింది

గురుజాడ లో నడిస్తే
గన్నేరు నవ్వింది

కలతను నే తీరిస్తే
కలువ పువ్వు నవ్విందికామెంట్‌లు