జోతలురావిపల్లి వాసుదేవరావు-పార్వతీపురం మన్యం జిల్లా9441713136
బాలలారా రారండీ
ఇష్టపడీ చదవండీ
ఇష్టపడీ చదివి మీరు
జ్ఞానాన్ని పొందండీ

బాలలారా రారండీ
సాయం చేయగరండీ
సాయం చేసీ మీరు
మానవతను చాటండీ

బాలలారా రారండీ
శ్రమను తెలియగరండీ
శ్రమవిలువ తెలిసి మీరు
శ్రమను గౌరవించండీ

బాలలారా రారండీ
జగమెల్ల తెలపండీ
ఈ జగాన అందరం
సమమే అని చాటండీ

బాలలారా రారండీ
వందనాలు తెలపండీ
జాతీయ వీరులకూ
జోతలు అర్పించండీ


కామెంట్‌లు