విశ్వాసానికి ప్రతీక కుక్క;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి.94928 11322
 సామాన్యంగా మనం కుక్కను చూస్తే ఇంట్లోకి రానివ్వం. ఏ పాత్రలో మూతి పెడుతుందోనని భయం, చెప్పు తింటుందని ఇంకొక ఆలోచన. జీవితంలో మనకు రెండు రకాలు మనస్తత్వాలు కటికి బీదరికాన్ని అనుభవిస్తూ గంజి నీళ్ళు కూడా కరువైన వ్యక్తికి అకస్మాత్తుగా అదృష్టం కలిసి వచ్చిధనికుడు అయితే  కడుపునిండా భోజనం చేయలేడు తన పాత స్థితిని  జ్ఞాపకం చేసుకొని తనను ఎవరు ఇబ్బందులు పెట్టారో వారి మీద పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అదే బ్రతికి చెడ్డవాడు అయితే ఆ స్థితికి రాడు. అలాగే కుక్క అందంగా ఉందని, తనకు నచ్చిందని  జమీందారు తీసుకువెళ్లి  బంగారపు సింహాసనం మీద కూర్చోబెట్టి  ఉన్నత స్థానం కల్పిస్తాడు. జంతువులంటే అతనికి ఎంతో ఇష్టం ఆ కుక్క  పాత యాజమాని పొరపాటు గా కనిపిస్తే ఆ సింహాసనాన్ని వదిలి  వెళ్ళి అతని ప్రక్కన నిలబడుతుంది. అందుకే వేమన "వెనుకటి గుణమేల మానురా" అన్నాడు. అసలు కుక్క స్వభావం ఏమిటి చెప్పు తినడం  అనుకుంటాము తాను ఏ యజమానిని నమ్మినదో ఆ యజమాని పట్టెడు అన్నం పెడితే  జీవితాంతం అతనికి కృతజ్ఞతగా వుంటుంది ఆ జీవి. విశ్వాసానికి ఏదైనా   జంతువు పేరు చెప్పమంటే మొదట మనం చెప్పేది కుక్కనే. దాని కడుపు నింపిన వాడి సంక్షేమాన్ని కోరుకుంటుంది. ఆ ఇంటిని కాపలా కాస్తూ దొంగలు రాకుండా, రౌడీలు రాకుండా  పిల్లలకు భద్రతను కల్పిస్తోంది.  నిద్రాహారాలు కూడా మాని యజమాని సేవలో నిమగ్నమై న ఆ సాధు జంతువును  "చెప్పు తినెడి కుక్క చెరుకు తీపేమెరుగర"  అని ఎద్దేవా చేసి మాట్లాడుతూ ఉంటాము.  ఎదుటివారిని చాలా బాగా చూసుకునే వ్యక్తి ఎదుటి వ్యక్తిని కానీ,  చివరకు క్రిమికీటకాలను కానీ చులకనగా చూడడం జరగదు  ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పాడు వేమన.కామెంట్‌లు