శత్రుత్వం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి.94928 11322
 జీవితంలో ఏ రెండు మనస్తత్వాలు ఒక రకంగా ఉండవు. పుర్రెకో బుద్ధి అని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఆదర్శంగా భార్య భర్తలు కాపురం చేస్తున్న కుటుంబాలను చూస్తే వారిలో సామరస్యం కనిపిస్తోంది.  భార్య భర్తల్లో ఎవరు ఏ తప్పు చేసినా సర్దుకుపోయే గుణం రెండవ వారికి ఉంటుంది. ఉదాహరణకు  వంకాయ కూరలో కారం ఎక్కువ అయింది భర్త కారాలు మిరియాలు నూరుతూ మాట్లాడితే, ఆమెకు ఎలా ఉంటుంది  సర్దుకుపోయే గుణం ఎలా ఉంటుందంటే  నువ్వు చేసిన కూర చాలా రుచిగా ఉంది  ఇంకా తినాలి అని అనిపిస్తూ ఉంది, కానీ దాంట్లో కారం కొంచెం తగ్గిస్తే ఇంకా రుచిగా ఉంటుంది.
అన్నప్పుడు భార్యకు ఎలా ఉంటుంది. తన తప్పు తనకు తెలుస్తోంది అలాంటి పొరపాటు మరొకసారి జరగకుండా చూసుకుంటుంది  అంతే కానీ ఈ రోజుల్లో లాగా ఇద్దరూ పోట్లాడుకుంటే  ఆ కుటుంబం వీధిన పడవలసిందే కదా. అలాగే తన శత్రువులతో కూడా  ప్రవర్తించడానికి  సహనం ఉండాలి. నిజానికి ఆ శత్రువు చేస్తున్న పనులు చూస్తే  అతని ప్రాణం తీయాలన్నంత  కోపం వస్తుంది  కానీ లౌక్యం ఉపయోగించి అతనితో ప్రవర్తిస్తే అతనిలో పరివర్తన రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ముష్టి యుద్ధానికి దిగితే  ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో చెప్పలేము. ఆ స్థితి రాకుండా ఓపికతో  అతనితో స్నేహభావంతో మాట్లాడితే  ఆ పద్ధతి వేరుగా ఉంటుంది దాని ద్వారా వచ్చే మార్పు శాశ్వతంగా ఉంటుంది.  దానికి వేమన చెప్పిన ఆటవెలది పద్యాలే ఉదాహరణ.


కామెంట్‌లు