ప్రజాకవి వేమన ; ఏ.బి ఆనంద్--ఆకాశవాణి.94928 11322
వేమన యోగి వ్రాసిన  ఆటవెలదులు  చదివినవారికి చదివినంత జ్ఞానాన్ని  ఇస్తాయి  సామాన్యునికి అర్థమయ్యే పద్ధతి వేరు, వేదాంతులకు అర్థమయ్యేది మరో కోణం,  శాస్త్రజ్ఞులకు శాస్త్రీయంగా తెలుస్తోంది ఒకే పద్యంలో ఇంతమందిని సంతృప్తి పరచగలిగాడు వేమన. వేమన సమాజానికి మెకానిక్ (ఆట=క్రీడ, వెలది=స్త్రీ)  చెప్పులోని రాయి అన్న దాన్ని  ఉదాహరణగా తీసుకుంటే  మనలాంటి సామాన్యులకు ఏమి అర్థమవుతుంది. మనం నడిచేటప్పుడు  కాలి చెప్పు లో ఉన్న చిన్నగులకరాయి  అడ్డు తగులుతూ ఉంటుంది  నడవడం కష్టం అవుతుంది.  కానీ  పెద్దవారికి  చెప్పు అంటే  కాలికి వేసుకునే చెప్పులు కాదు మాట్లాడడం అన్న అర్థాన్ని తీసుకుంటారు.   వారికి కావలసింది ఏమిటి? మనిషి లోపల ఉన్నటువంటి రాయి కఠినంగా ఉంటుంది, ఘనంగా ఉంటుంది 
అది జన్మలో మెత్త పడదు, కరగదు. కఠినాత్ములను కరుణామయులుగా చేయడం ఈ జన్మలో ఎవరికీ సాధ్యం కాదు. కంటిలో నలుసు అంటే ఏదో చిన్న క్రిమికీటకం లాంటిది  కంటి లోపల ఇబ్బంది పెడుతుంది అని అర్థం కాదు  మనం చూసే చూపుల్లో  స్పష్టత ఉండాలి ముందే ఊహించుకొని ఇలా ఉంటుంది అని అనుకుంటే అలాగే కనిపిస్తుంది  అలాంటి వారిని  చేరదీయ వద్దు  అని జాగ్రత్త చెబుతున్నాడు మహానుభావుడు. మనం నడిచేటప్పుడు కాలికి ముల్లు గుచ్చుకుంటే ఎలా ఉంటుంది  ముందడుగు వేయడం చాలా కష్టం. అతి చిన్న వస్తువు కూడా  ఆరడుగుల మనిషి  పనులన్నీటిని చెడగొడుతుంది  అలాగే ఇంటిలోని పోరు అన్న దానికి  చాలామంది  భార్య గడసరై వుంటుంది లేకుంటే వాడు ఎందుకు అంత మధన పడతాడు అని ఎద్దెవా చేస్తారు.  ఇక్కడ ఇల్లు అంటే నాలుగు గోడలతో కట్టి  పైన తాటాకు గాని, పెంకుతో గాని నేసినది కాదు. శరీరం లోపల దాగి ఉన్న పదార్థం. ఇల్లు అంటే శరీరము అన్న అర్థము ఉన్నది. ఆ లోపల మనసు  అనేక ఆలోచనల పుట్ట.  ఒకదాని మీద  మనసు  నిలుపలేదు. అందుకే త్యాగరాజస్వామి లాంటి సంగీత ప్రవక్త  మనసు నిల్ప శక్తి  లేకపోతే మీ జీవితం అంతే అంటాడు. ఆ విషయాన్ని చాలా స్పష్టంగా  అర్థవంతంగా చెప్పాడు వేమన.  ఇలాంటి అర్థాలను తెలుసుకొని  దానిలో సారాన్ని ఆస్వాదించగలిగే  మంచి రచయితగా రాణిస్తాం. మీరూ ప్రయత్నం చెయ్యండి.
 
మీ బుధజన విధేయుడు
ఏ.బి ఆనంద్
ఆకాశవాణి
Ph.no- 94928 11322

కామెంట్‌లు