తెడ్డు;-ఏ.బి ఆనంద్ఆకాశవాణి.94928 11322
 అమ్మ వంట గదిలో పప్పు ఉడికిన తరువాత  దానిని ఎనుపుతుంది  దానికి తెడ్డు  అవసరం దానికి తిప్పడం తప్ప పప్పురుచి తెలియదు.  ఆ శబ్దం మీద వచ్చే నానుడి కూడా ఉంది. నేను ఎక్కువగా ప్రయోగించే నానుడిలో  బతకలేక బడిపంతులు... ఆ రోజుల్లో బడిపంతులుకు ఎంత జీతం ఇచ్చే వారు నిత్య ఖర్చులకు కూడా సరిపోనంత  దానికి నేనేం చెప్తాను అంటే  బ్రతక లేక బడిపంతులు కాదు  బ్రతికించడం కోసమే బడిపంతులు అని. ఆ రోజున ఆయన అక్షరాలు దిద్దించకపోతే ఈ రోజున ఇంత చదువు చదివేవాళ్ళం కాదు కదా. దీనిలో రెండు శబ్దాలు ఉన్నాయి నానుడి, జాతీయం  నానుడి హాస్యంగా భోజనాలు చేసే సమయంలోనో మరో సమయంలోనో  మాట్లాడుకుంటూ ఎద్దేవా చేసుకుంటూ ఉంటాం. ఆ సందర్భంలో నానుడిని వాడతాం. ఇప్పుడు అసలు విషయానికి వస్తే  తెగిడిస్తే తెడ్డే లింగం పదాలను విడదీసి అర్థం చేసుకుంటే  ఇది ఎందుకు ప్రాచుర్యంలోకి వచ్చిందో అన్నది తెలుస్తోంది.
తెగ అంటే శాఖ ఆ తెగ లింగభేదం విడిస్తే (వదిలిపెడితే)  తెడ్డు తనపని తాను చేసుకుంటూ తన బాధ్యతను తాను చేస్తూ ఇలా చేతిలో వస్తువుగా ఉన్నంత వరకు దాని స్థానంలో ఉంటుంది అది. నిజానికి దైవ స్వరూపం భగవంతుడు దానికి ఏ పనిని అప్పగించాడో దానిని అది చేస్తూ ఉంటుంది కనుక అది లింగ స్వరూపం. శివుడు పద్మాసనం వేసి జగత్తు మొత్తాన్ని తన అకారంతో నియంత్రిస్తూ కాచి రక్షిస్తాడు కదా ఆ స్థితికి వెళ్లడమే దీని పరమార్థం. గీతాచార్యుడు ప్రవచించినట్లు నీ పని నువ్వు చేసుకో నిన్ను ఆజ్ఞాపించేది స్త్రీ దేవతా? పురుష దేవుడా? అన్నది వదిలి వేసి  నిన్ను నీవు తెలుసుకునట్లయితే  నీలో ఉన్న భగవత్ స్వరూపాన్ని నువ్వు ప్రతిష్ఠించుకున్న అనుభూతిని కలుగుతుంది.  ద్వైత స్థితి నుంచి అద్వైత స్థితి పెరుగుతోంది అన్నదే ఈ నానుడి అర్థం అని నా భావన.  కామెంట్‌లు