గోతులు తవ్వే స్నేహితులు;-ఏ.బి ఆనంద్--ఆకాశవాణి.94928 11322
 మనిషి జీవితం చాలా చిత్రమైనది  తానొక్కడే ఉంటే వ్యష్టి, భార్య వస్తే వ్యక్తి  పిల్లలు కూడా ఉంటే సమష్టి. దీనిని దాటి సమాజంలోకి వెళితే అనేక మంది స్నేహితులు, మిత్రులు  మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. వారిలో మంచి వారెవరో, చెడ్డ వారెవరో మనం ఊహించలేం  మంచి మాటలతో బోల్తా కొట్టించి నిన్ను మించిన స్నేహితుడు లేదు అని చెప్పుకునే వాడొకడు, ప్రక్కన గోతులు తవ్వుతూనే మీ అంత మంచివాడు లేడు మీ అంత ఉదారుడు నాకు కనిపించలేదు  అందుకే మీ స్నేహాన్ని కోరి వచ్చాను అంటూనే వాడిని నాశనం చేస్తారు. ఎవరో నూటికి కోటికి ఒక్కరు  ప్రక్కదోవ పడుతున్నావు, అందరినీ నమ్ముతున్నావు, చాలా జాగ్రత్తగా ఉండాలి  చాలామంది పైకి కనిపించేంత  మంచివారు కాకపోవచ్చు  వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఎన్నిరకాల హిత వాక్యాలు చెప్పినా  ఇతనికి రుచించదు తన ధోరణి తనదే.
వచ్చిన వారిలో తాగుబోతులు వుండవచ్చు, తిరుగుబోతులు ఉండవచ్చు.  దొంగలు, దోపిడీ దారులు, హంతకులు ఉండవచ్చు ఉదాహరణకు మందు తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది చక్కగా నిద్ర పడుతుంది అని చెపితే వారి మాటల్లో పడిపోతావు జాగ్రత్త అంటూ కొంచెం కొంచెం పెంచుకుంటూ వారి జీవితాలను సర్వనాశనం చేస్తారు మిత్రుడు అని చెప్పుకునే రాక్షసులు.  అలాగే విటులు కూడా  పై పై మెరుగులు చూసి  ఆకర్షితులై  వేమన లాగా జీవితాన్ని నాశనం చేసుకుంటారు. అందుకే వేమన కవి చెప్తాడు  "గడుసురాలు మగని గంప  పెట్టమ్మురా" జీవిత భాగస్వామిగా జీవితమంతా హాయిగా ప్రశాంతంగా గడపవచ్చు. జీవితాన్ని అనుభవించ వచ్చు అన్న సమయంలో  భర్తను బుట్టలో పెట్టి అమ్మకానికి కూడా సిద్ధమయ్యే భార్యలు వున్నారు.  అలాంటి వారితో కాపురం చేయడం ఎంత నరకమో  వేమన యోగి చెబుతాడు. విన్నవాడు సుఖపడతాడు, వినని వాడు  వాడి కర్మకు వాడే బాధ్యుడు అవుతాడు. ఎవరైనా మంచి చెప్పగలరు గానీ, చేయించలేరు కదా ప్రేమ కూడా అంతే...కామెంట్‌లు