అమ్మ; -ఏ.బి ఆనంద్ఆకాశవాణి.94928 11322
 అమ్మను మించిన నటీమణి ఈ ప్రపంచంలో మరి ఎవరూ లేరనే చెప్పాలి. కన్న తల్లిని సొంత దేశాన్ని మర్చిపోయే మనిషి ఎవరైనా ఉన్నారా?  అమ్మ పేరు ఎంత కమ్మగా ఉందో  అంత అందమైన అర్థం దాగి ఉంది  అకార మధ్యమంలో మకర ద్వయం (అ- మ- మ- అ)  బ్రహ్మను సృష్టించినది కనుక అమ్మా అంటాడు  నవమాసాలు మోసి, నిత్యం ఆమె పడిన కష్టాలు  ప్రసవించేటప్పుడు ఆమె అనుభవించిన నరకం  ఆ బిడ్డకు నడక నేర్పుతూ,  నడత నేర్పటానికి పడ్డ శ్రమ  ఎవరు గుర్తిస్తున్నారు  గర్భస్థ శిశువు తల్లి ఏ రెండు నెలలు, మూడు నెలలు  మామూలుగా ఉంది  తర్వాత ప్రతి నెల ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది  ఎంత జాగ్రత్తగా గర్భస్థ శిశువులు కాపాడుకుంటుంది ఒక్కొక్కసారి నిద్రాహారాలు కూడా మానేస్తుంది. ప్రసవించడం అంటే మరో జీవితానికి మార్గాన్ని వెతుక్కోవడమే  ఒక ప్రక్క తనకుట్లు మానక  నరకం అనభవిస్తునే నోరులేని ఆ పసిగుడ్డు ఆకలి  తీర్చడం మలమూత్రాలు శుభ్రం చేయడం చీదరించుకోకుండా  చేస్తుంది ఆ తల్లి  బుడిబుడి నడకలు నడిచేటప్పుడు ఎక్కడ పడిపోతాడో అని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటుంది క్షణం తీరిక ఉంటుందా?  అర్థరాత్రి అపరాత్రి అనే భేదం లేకుండా వాడి ఆటపాటలతో ఎందుకు ఏడుస్తావు లేదో తెలియదు, ఎందుకు నవ్వుతాడో తెలియదు  అవన్నీ ఆ తల్లికి పాఠాలే  ఆ మూగ భాషను కూడా అర్థం చేసుకున్న జ్ఞాని  అక్షరాలు దిద్దించడం  దగ్గరనుంచి  చదువు పూర్తయ్యే వరకు రాత్రింబగళ్ళు  వాడి ప్రక్కన జాగరణ చేస్తూనే ఉంటుంది. అలాంటి పవిత్ర మూర్తికి విడిస్తున్న గౌరవం ఏపాటిది  ఆస్తి వ్రాసి ఇవ్వలేదని కోడల్ని సరిగా చూడలేదని నానారకాల  కారణాలని చెప్పి హింసిస్తూ  చివరికి హత్యలు కూడా చేసే దుర్మార్గులు, రాక్షసులు ఎంతమంది ఉన్నారో తెలుగు గడ్డ మీద. రాక్షసులకే రాక్షసులైన దశకంఠుడు  కూడా తన రక్తం పంచుకు పుట్టిన సొంత చెల్లి కి  ఇచ్చిన మాట ప్రకారం తన ప్రాణాన్ని కూడా అర్పించారు.  ఉదయం లేవగానే ముందు తల్లి పాదాలకు నమస్కారం చేసి ఆమె ఆశీస్సులు పొంది  ఆ తరువాతనే  తన కార్యక్రమాలు ప్రారంభిస్తాడు చెల్లి కోసం  ప్రపంచానికే మార్గదర్శి అయిన సీతమ్మ తల్లిని చెరబట్టి  ఆమె ఆనందం కోసం  అశోకవనాన్ని సృష్టించి దాని క్రింద ఆమెకు సపర్యలు చేయడానికి  తన తమ్ముడి కుమార్తె త్రిజటను  ఉంచాడు  అలాంటి రాక్షసునితో పోలిస్తే  ఈ రాక్షసుడి కి మరొక పేరు ఏమైనా ఉందా  నా మెదడు కు ఏదీ తోచటంలేదు  ఏదైనా ఆలోచించి చెప్పి పుణ్యం కట్టుకోండి.కామెంట్‌లు