:అమ్మ;-సి.హేమలత--పుంగనూరు9666779103
నా జీవితానికి తొలి కిరణంలా అడుగు అడుగున వెలుగు చూపే అమ్మ 
బుడిబుడి అడుగుల తడబాటు లో సహాయకారిగా ఊతం ఇచ్చే అమ్మ చేయి


ఆకలిగొన్న వేళ పాల బువ్వ తినిపించు అన్నపూర్ణ లా అమ్మ

నిద్ర వచ్చే వేళ నా అచ్చమైన కోయిల పాట లా అమ్మ జోల పాట

కలతచెంది కలవరపడిన వేళ వెచ్చని ఓదార్పులా అమ్మ ఒడి

శీతాకాలం సాయంసంధ్యన వణికిస్తున్న చలి కి రక్షణ కవచంలా అమ్మకొంగు

సమస్యల వలలో చిక్కిన వేళ దిక్సూచిలా అమ్మ మాట

సహనంలో ధరిత్రి మాతల కనిపించు నట్టింట నడయాడే అమ్మ

చల్లని నీడలా ఆమె ఆహార్యం
రాయంచ నడకల అమ్మ ఆత్మ స్థైర్యం

ప్రతి ఇంటా అందరి దేవతలా అందమైన అమ్మ ఇలన
 కారాదు అంగడి బొమ్మ...కామెంట్‌లు