అన్న ప్రేమ ;-లతా శ్రీ-9666779103
 భ్రమరాంబ పురం లో సోమన్న రంగమ్మ అనే దంపతులు ఉండేవారు వీరు వ్యవసాయం పైన ఆధారపడి జీవించే వారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు జీవన్, భావన్. భ్రమరాంబ పురానికి మూడు కిలోమీటర్ల దూరంలో పాఠశాల ఉండేది .జీవన్ భావన్ 4,6 తరగతులు చదువుతున్నారు. ప్రతిరోజు ఉదయం మూడు కిలోమీటర్లు సాయంత్రం మూడు కిలోమీటర్లు నడుస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవారు.
అది వేసవి కాలం భానుడి తాపం తట్టుకోలేక పక్షులు జంతువులు సైతం దాహంతో అల్లాడుతున్నాయి. చెట్లు వెలవెలబోతున్నాయి. మధ్యాహ్న పాఠశాల కావడం వల్ల మిట్టమధ్యాహ్నం వేళ నడిచి ఇంటికి రావలసి వచ్చేది జీవన్ భావన్. వీరితో పాటు వీరి వయసు పిల్లలు దాదాపు 10 మంది దాకా నడిచి వెళ్ళి వచ్చేవారు.
ఏప్రిల్ మాసాన ఒంటిపూట బడులు తర్వాత పిల్లలు నడుచుకుంటూ భ్రమరాంబ పురం వైపు వస్తున్నారు. అందరికీ దాహం వేస్తుంది. చెమటలు కారుతున్నాయి .నిలువ నీడ లేదు ఆ దారి వెంట. జీవన్ నోరు పిడచ కట్టుకు పోతుంది ఎవరి దగ్గర నీరు లేదు. పిల్లలందరికీ దాదాపుగా అదే పరిస్థితి అటువంటి సమయంలో కాలికి రాయి తగిలి చెప్పు కూడా తెగిపోయింది .జీవన్
 చెప్పులు లేకుండా మండుటెండలో నడుస్తూ కళ్ళు బైర్లు కమ్మి కిందపడిపోయాడు ఒళ్ళంతా చెమటతో తడిసి ఉంది భావన్ తమ్ముడిని ఎత్తడానికి పరిగెత్తాడు.జీవన్. ...జీవన్ అంటూ పిల్లలందరూ గుమిగూడారు....
భావన్ తమ్ముడిని కుదుపుతూ పిలుస్తున్నాడు..జీవన్ లో జీవం లేదు.సోమన్న,రంగమ్మలు లబోదిబోమంటూ ఏడుస్తున్నారు..ఎవరెవరో వచ్చారు.కొందరు ప్రభుత్వాన్ని తిట్టారు.మరికొందరు తల్లిదండ్రులను తిట్టారు...మరికొందరు ఓదార్పు మాటలు చెప్పి జీవన్ ని మట్టిమరుగు చేసి వెళ్ళారు...భావన్ కళ్ళలో జీవన్ మరణం నిలిచిపోయింది.తమ్ముడి ని వదిలి క్షణం ఉండని భావన్ ప్రపంచం శూన్యమైంది.
ఎప్పుడూ స్తబ్దుగా కూర్చుంటున్న భావన్ ను చూసి రంగమ్మ కు గుబులైంది..పెద్దవాళ్ళ సలహాతో భావన్ ను తీసుకొని పట్నం వెళ్ళారు.. డాక్టర్ కౌన్సెలింగ్ ...స్థలం మార్పిడి వలన క్రమంగా భావన్ లో మార్పొచ్చిందనుకున్నారు.కాని తమ్ముని పై గల ప్రేమ భావన్ మరువలేక పోయాడు.విద్యాభ్యాసం లో భాగంగా ఎండతీవ్రతకు గల కారణాలు..వాటిపరిణామాలు..వాటి వలన కలిగే అనర్థాలపై లోతైన పరిశోధన చేస్తూ పెరిగి పెద్దవాడయ్యాడు.ఎండ లు వలన అనర్థాలు తగ్గించ డానికి మార్గాలను అన్వేషించి సఫలం అయ్యాడు..ప్రముఖ వాతావరణ శాస్త్ర వేత్త అయ్యాడు...
ఉద్యోగం చేస్తూనే...తన ఊరి వాళ్ళను, అలాగే వాలంటీర్లు ను ఒక చోట చేర్చి రోడ్డుకిరువైపులా చెట్లునాటించడం,వేసవిరోజుల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయటం,ఇంకుడు గుంతలు త్రవ్వించడం చేస్తున్నాడు..తన స్వంత ఖర్చులతో.. ప్రజలకు ఎండ తీవ్రత పెరుగుటకు గల కారణాలు తెలియజేస్తూ కరపత్రాలను అందిస్తూ ఎండ తీవ్రత తగ్గించడంలో నీటిమట్టం పెంచడంలో మన కర్తవ్యాలను గుర్తు చేస్తూ వివిధ రకాల కార్యకలాపాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాడు.
జీవన్ లా మరో జీవన్ మధ్యలో తనువు చాలించకూడదు అను సదుద్దేశంతో...మనం భావన్ తో చేతులు కలుపుదామా... పిల్లలూ
సి.హేమలత
✍️ లతా శ్రీ-9666779103

కామెంట్‌లు