సాలుబడిలోనే సాగుబడి;-డా.టి.రాధాకృష్ణమాచార్యులు9849305871.
పురుషాధిక్యపు ఏలుబడిలో సాగే
దురహంకార లోకంలో
అమ్మ చిరునామా మాయమైంది

సాలుబడిలోనే సాగుబడి చేసే
మగాడు, మృగాడైన వీధిబడిలో
అమ్మతనం ఓ శేష ప్రశ్నగా మారింది

ముగింపే లేని అకృత్యాలకు 
తెగించే కొడుకులను కనకండి తల్లీ ఇకనైనా
మాతృమూర్తి ప్రేమను చిదిమేసే 
వెర్రి మగజాతి లేకున్నా తృప్తే 
ఈ భూమికి

అమ్మలారా క్షమించండి
మీ త్యాగానికీ, ప్రేమకూ 
ఇవే మా వందనాలు...
అందాల పేగుబంధాల 
మాతృదినం రోజున...


కామెంట్‌లు