అలుపెరగని శ్రమ జీవుల సంబరం--వెంకట రమణా రావు--9866186864
శ్రమయేవ జయతే
యువతే భవిత

కర్షకులు కార్మికులు
కూలీలు మాలీలు
మేధావులు వ్యాపారులు
ఎవరికైనా శ్రమయే శక్తి
శ్రమ యే ఆయుధం

శ్రమజీవుల అలుపెరుగని
అంతులేని అంకితభావం
జాతికి ఊపిరి పోసే
ఆశా భావం 

జాతికి వెన్నెముకలు
ప్రగతి బాట సారథులు
జాతి విజయ దీపికలు

భవిత కు భరోసా 
యువతకి ఆదర్శం
మన కార్మిక సోదర లోకం

అందుకోండి మా అభినందనలు
సాగిపొండి అభ్యుదయ పథం లో


కామెంట్‌లు