ఆదర్శసమాజనిర్మాణంలో గురజాడ సాహిత్యం;-భరద్వాజరావినూతల ;9866203795

 సాహితీబృందావనవేదిక 
ప్రక్రియ-సున్నితం
రూపకర్త -నెల్లుట్ల సునీత 
=====================
4️⃣2️⃣1️⃣)
 అక్షరం ఆయన ఆయుధం
సామాజికసమస్యలపై పోరాటం
చేశాడు స్త్రీజనోద్దరణకు కృషి
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
******** 
4️⃣2️⃣2️⃣)
 చేశాడు తెలుగుసాహిత్యం సుసంపన్నం
సామాజిక సమస్యలకు మార్గం
వాడుకభాషకుపోశాడు ప్రాణం
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
******** 
4️⃣2️⃣3️⃣)
వాడుకభాషా రచనలుచేసి
కన్యాశుల్కవ్యతిరేక పోరాటంచేసి
అయ్యాడు సామాజిక రచయిత
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
******** 
4️⃣2️⃣4️⃣)
ఆంధ్రసారస్వతపరిషత్తు స్థాపకుడు
వట్టిమాటలు వద్దన్న రచయిత
గిడుగువారి సమకాలికుడు ఆయన
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
******** 
4️⃣2️⃣5️⃣)
కన్యాశుల్కం రక్తి కట్టించి
పుత్తడిబొమ్మకు ప్రాణంపోసి
ముత్యాలసరాలతో మురిపించాడాయన
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
******** 

కామెంట్‌లు