*మమతల తల్లి కి అక్షర పుష్పాభిషేకం*;-ఇమ్మడి రాంబాబు--చరవాణి:9866660531
అమ్మ ప్రేమ అమృతం .
అనురాగానికి ప్రతిరూపం
మమతల తల్లి.. కల్పవల్లి
అమ్మమనస్సు వెన్నపూస కడుపులో దాచెను కష్ఠాలు
కడలిలోని కెరటాలుగ..
తల్లి తన కన్నీటిని..మనకు
నిత్యం పంచేను..అమ్మగా సుఖః సంతోషాలను వర్షించే
స్వాతి ముత్యపు జల్లుగా ..
త్యాగమూర్తిగా..సహనవతి భూ మాతగా..త్రిశక్తి మాతయై.
నవ మాసాల నిరీక్షణతో..
మా`నవ` జన్మ కు 
మూలవిరాట్టు దేవతా మూర్తియే..అమ్మ
తన గర్భగుడిలో రక్షణనిస్తు
మనకు జన్మనిస్తూనే..
తను పునఃజన్మతో పునీతురాలు..పుణ్యమూర్తి
మూర్తీభవించిన స్త్రీ..అమ్మ
మారాం చేసే మనకు గోరుముద్దలు తినిపించే ఆకాశమంత ప్రేమతో.. అమ్మ
ఆనందాల హరివిల్లు..అమ్మ.
జీవన నడవడికలో..మన తప్పటడుగులను..సున్నిత మనస్సుతో సరిచేసే అమ్మగా.
తొలి గురు మూర్తిణిగా
తన ఒడి బడిలో... సత్యవాక్కుల శిక్షణా వాణి
మన ఉన్నతికి..అనుక్షణ త్యాగశీలి..అమ్మ..పదిలంగా చూసుకున్న అమ్మను
అందరు ఉండి..సమాజం న చులకనవ్వక అవసానదశలో..
అమ్మా నాన్నల అనాథలు
చేయక..ఈ తరం అమ్మా నాన్నలు రేపటి మీ భవిష్యత్ రక్షణ కై..మీ తోటి వారి స్పూర్తికై..అక్కున చేర్చుకోండి అమ్మను.నేడు నడి వీధిన...నడయాడుతున్న అనాథ వృద్ద అమ్మలను ఆదుకుందాం నేటి మాతృదినోత్సవ స్పూర్తిగా..ప్రతి దినం 
మాతృ దినోత్సవం గా భావిద్దాం...పున్నమి వెన్నలలా  నవ్వుల పూలు పూయిద్దాం అమృత తుల్యులు
మాతృమూర్తులకు..మాతృ దినోత్సవ శుభవందనాలు.


కామెంట్‌లు