కనక మహాలక్ష్మి ;- "శంకర ప్రియ.," శీల.,సంచారవాణి: 99127 67098
 👌కనక వర్ణము తోడ
     విరాజిల్లు జననివి!
     మహాలక్ష్మివి నీవె!
            శ్రీమాతా శివాని!
      ( శ్రీమాత పదాలు.. శంకర ప్రియ.,)
👌శ్రీమాత.. పరదేవత! త్రిశక్తి రూపిణి! శ్రీమహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి.. యనెడు మూడు మూర్తులుగా  విరాజిల్లు చున్నది!
👌శ్రీలలితా సహస్ర రహస్య నామ స్తోత్రము నందు.. "శ్రీమాత వైభవము"ను కీర్తించారు, హయగ్రీవ స్వామి!
       "ఇచ్ఛాశక్తి, జ్ఞాన శక్తి, క్రియాశక్తి స్వరూపిణి".. శ్రీ లలితాంబికగా అభివర్ణించారు!
👌శ్రీమాత, లలితాంబిక.. విశాఖపట్నం నందు.."కనక మహాలక్ష్మి" గా విలసిల్లు చున్నది! భక్తమహాశయుల మనోభీష్టములను నెరవేర్చు చున్నది! అందరినీ కంటికి రెప్పలా కాపాడు చున్నది, జగన్మాత యైన శ్రీమాత!
 ⚜️సీస పద్యము:
    కనక సుందర దివ్య
కమనీయ శుభగాత్రి, మాతరో శ్రీ దేవి! జోత లివియె!
     శారదా మూర్తివై జనులను కాపాడు, మాత శ్రీ లలిత! నమస్సు లివియె! 
     శ్రీమహా లక్ష్మివై సిరులను కురిపించు, మాతరో శ్రీదేవి! జోత లివియె 
      పార్వతీ దేవివై భక్తుల కాపాడు, మాత శ్రీ లలిత! నమస్సు లివియె 
          ( తేట గీతి )
     ముగ్గురమ్మల తేజమౌ, మూల రూప
     మగుచు, జనులను గాపాడు అమ్మ వీవు! 
     ధర విశాఖను వసియించు, తల్లి వీవు! 
     అందుకొను మమ్మ! మావగు             వందనములు !
     ( రచన: "శివలెంక" డా. మీగడ రామలింగ స్వామి., )

కామెంట్‌లు