కర్మ ఫలము తప్పదు! "శంకర ప్రియ.," శీల.,సంచారవాణి: 99127 67098
 👌 రామ చంద్రుని కైన
    కర్మ ఫలముల నెపుడు
    అనుభవింప తప్పదు! 
          శంకర ప్రియు లార!
    (..శంకర ప్రియ పదాలు., )
👌 కౌసల్యా దశరథ మహారాజుల కుమారుడు.. శ్రీరామ చంద్రుడు! పితృవాక్య పాలకుడు! తన తండ్రి మాటను శిరసా వహించి; సీతాదేవితో, తమ్ముడైన లక్ష్మణునితో అరణ్యవాసము చేసాడు! 
👌ఆ సమయములో.. రాముని భార్యను; రావణాసురుడు మాయో పాయముతో అపహరించాడు! ఆ సీతారాముడు.. సామాన్య మానవుని వలె, పలు కష్టములను అనుభవించాడు! మర్యాదా పురుషోత్తము డైన రాముడే.. మనకు, సకల మానవాళికి, ఆదర్శ ప్రాయుడు!
⚜️తేటగీతి పద్యము:
       రాముడంతటి వాడిల, రమణి సీత 
      బాసి, అడివిలో పామరున్ వలె తిరిగెను 
       ఇంత కన్నను ఘోర మింకేమి కలదు? 
       "కర్మ ఫలము"ను తప్పింప కర్త లెవరు?
       ( రచన: "శివలెంక" డా. మీగడ రామలింగ స్వామి ., )

కామెంట్‌లు