శ్రీమాత! పరదేవత!"శంకర ప్రియ.," శీల.,సమర్పణ: 99127 67098
 👌"శ్రీమాత".. సచ్చిదానంద రూపిణి! పరం బ్రహ్మాని! జీవులందరికీ.. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి.. యనెడు మూడు దివ్య శక్తులను అనుగ్రహించునది! "త్రిశక్తి రూపిణి'.. శ్రీమాత!
 👌"శ్రీమాతా! శ్రీమహారాజ్ఞీ!" అని, శ్రీలలితా రహస్య నామ స్తోత్రము నందు "శ్రీమాత వైభవమును" ప్రస్తుతించారు, మహావిష్ణు స్వరూపుడైన, హయగ్రీవ స్వామి!
👌సకల ప్రాణికోటికి.. సర్వ శుభములు, సిరి సంపదలు, భోగ మోక్షములను ప్రసాదించునది! "మంగళదేవత".. శ్రీమాత! 
      దేవతలు, దానవులు, మానవులు.. మున్నగు వారియందు, మాతృ వాత్సల్యము కలది! "మాతృ రూపిణి".. శ్రీమాత!
      అట్టి జగన్మాత, లలితాంబికకు; భక్తి ప్రపత్తులతో.. రెండు చేతులను జోడించి నమస్కరించు చున్నాను!
        ⚜️ శార్ధూలం పద్యము:
      శ్రీమ న్మంగళ దేవతా! శుభతతిన్ శీఘ్రంబుగా గొల్పుమా!
      "శ్రీమాతా!" వర భాగ్యదాత!  దయతో జేకొమ్మ! నీ భక్తులన్;                                                            
       ప్రేమోద్భాస ముఖ ప్రదీప్త జననీ! విజ్ఞాన సంవర్ధినీ!
       నీమంబొప్పగ నిన్నుఁ గొల్తును సదా నీ సత్కృపన్ బ్రోవుమా!
( రచన: "చిత్రకవితా సమ్రాట్" శ్రీ చింతా రామకృష్ణా రావు., "శ్రీలలితా సహస్రనామాoచిత పద్యసహస్రదళ పద్మార్చన., )
   🕉️శ్రీమాత! జయ శ్రీమాత! జయ జయ శ్రీమాత!
      ( శ్రీమాత  పంచ దశాక్షర నామ మాలిక )

కామెంట్‌లు