👌శ్రీశైల శిఖరమును
దర్శించి నంతనే
జన్మ చరితార్ధమగు!
శంకర ప్రియులార!
( శంకర ప్రియ పదాలు.,)
👌శ్రీశైలమే.. దక్షిణ కైలాసము! ఒక పుణ్యధామము! ఆది దంపతులైన శ్రీ ఉమా మహేశ్వరులు.. "శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి" నామధేయులై; అర్చామూర్తులుగా వేంచేసి యున్న మహిమాన్విత క్షేత్రము!
"శ్రీపర్వతము"ను ఆధ్యాత్మిక సాధకులు, శివయోగులు.. ఒక "మహాశివ లింగరూపము"గా భావించి; శివాద్వైతానుభూతిని పొందుచున్నారు!
👌సిరిగిరి పైన కొలువై యున్న, దివ్య జ్యోతిర్లింగ మూర్తిగా విరాజిల్లుతున్న; శ్రీస్వామివారి యొక్క దేవాలయ శిఖరమును దర్శనము చేసుకుంటారు, భక్తమహాశయు లందరు! వారు.. భక్తి ప్రపత్తులతో, తారక మహామంత్ర మైన "శివ"నామ స్మరణము కావిస్తారు. ఆ క్షణములో.. వారి పాప కర్మలు, పాశము లన్నీ తొలగిపోయి; పుణ్యాత్ములై, శివతత్వ జ్ఞాను లగుచున్నారు!
👌"శ్రీశైల శిఖరo దృష్ట్వా, పునర్జన్మ నవిద్యతే!" యనెడు ఆర్యోక్తి ప్రకారం; ఆరాధకులు.. జీవన్ముక్తులై, శ్రీకైవల్య పదమగు "శివము"ను పొందుచున్నారు! శివమస్తు!
⚜️ఉత్పల మాల పద్యము
నీ శిఖరమ్ము దర్శనము నిర్మల రీతుల గాంచ, పాపపున్
పాశము లన్నియున్ దొలగు, భవ్య పథమ్మును జేర్చ గల్గెడున్!
నీ "శివ" నామ మెప్పుడును నెమ్మది నే జపియించు చుందు, ఆ
క్రోశము జూపగా తగదు! కూర్మి ననుం గను! మల్లికార్జునా!
( రచన: డా. శాస్త్రుల రఘుపతి., శ్రీ మల్లికార్జున నుతి.,)
🔱జయ జయ శంకర!
హర హర! శంకర!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి