జగద్గురువు శంకరులు "శంకర ప్రియ.," శీల., సంచారవాణి: 99127 67098
 స్వాత్మ తత్వము నొసగు
         సకల మానవాళికి!
         సద్గురువు శంకరులు!
                 శంకర ప్రియులార!
 (-- శంకర ప్రియ పదాలు.,)
👌జగద్గురువులైన ఆదిశంకరులు.. నిద్రాణమై యున్న నరజాతిని, జాగృతం కావించారు! అందరికీ యథార్ధమైన "ఆత్మ తత్త్వ జ్ఞానమును" యుక్తి యుక్తముగా ప్రబోధించారు!
👌మన సనాతన ధర్మమునకు మూల స్థంభములైన.. "సత్యము, ధర్మము" ..మున్నగు వాటిని; మానవ సమాజము నందు బహుళ ప్రచారము చేసారు! సమస్త ప్రజలందరికీ ఆధ్యాత్మిక భిక్షను అనుగ్రహించిన మహా మనీషి! "పరివ్రాజక శిరోమణి" అయిన జగద్గురువులు, శంకర భగవత్పాదులు!
⚜️ తేటగీతి పద్యము 
      విశ్వ జనత కాధ్యాత్మిక భిక్ష పెట్టి
       జాగృతంబును కావించి, జగతి నంత
       సత్య ధర్మ సంస్థాపనాచార్య వరుడు
       శాశ్వతుండయ్యె శంకరాచార్య గురుడు!!
    
     ( "శ్రీమచ్చoకర భగవత్పాదులు" మధురకవి, శ్రీదేవులపల్లి చెంచు సుబ్బయ్య శర్మ.,)
        💐జయ జయ శంకర! హర హర శంకర!

కామెంట్‌లు