అంశం:-
సంతూర్ పండిట్ శివకుమార్ శర్మ
13జనవరి 10 మే
1938 2022
...............................
ఎల్లలులేని సంగీత సామ్రాజ్యానికి అరువది సంవత్సరాలు రారాజు వై
భరతావని నే గాక వసుదైక
కుటుంబాన సంతూర్ సంగీత సాధనంతో ఓలలాడించి ప్రపంచ సంగీత ప్రియుల హృదయాలను రంజింప చేసిన సంతూర్ శివ కుమార్ శర్మ
మీరు పరమేశ్వరుని మానసపుత్రులే.....!!
సంగీత కుటుంబంలో జమ్ము లో జన్మించి తండ్రి
ఉమాదేవ శర్మ వద్ద ఐదవ ఏటనే సంతూర్ తబలా వాయిద్యాలలో శిక్షణ పొంది పడమూడవ ఏటనే
ముంబై లో తొలి ప్రదర్శనతో ప్రముఖుల మన్ననలను పొందిన
మీరు సంగీత సామ్రాఙ్ఞానికి
రారాజులే......!!
ప్రముఖ దర్శక నిర్మాత శాంతారామ్ నిర్మించిన
నాటి మేటి సంగీత ప్రధాన చిత్రం' జనక్ జనక్ పాయల్ బాజే' తో సినీరంగ ప్రవేశం చేసి ప్రముఖ సంగీత విద్వాంసులు హరిప్రసాద్ చౌరాసియా మరియు బ్రిజ్ భూషణ్ లతో రూపొందించిన సంగీత ఆల్బమ్ ప్రపంచాన నేటికి
సంగీతాభిమానులకు ప్రామాణికం. నా శిష్యుడు రాహుల్ అని పుత్రుని పరిచయం చేసి ఒకే వేదికపై పోటీపడి సంతూర్ తో సంగీత ప్రదర్శన చేసిన
మీరు కళాతపస్వులే...!!
సిలిసిలా, చాందిని, దార్, వంటి నేటి సినిమాలలో మీరు ప్రదర్శించిన సంగీత
మధురిమలు యువతకు ప్రేరణ.అనేక పురస్కారాలను దేశవిదేశాల నుండి పొంది అత్యున్నత పద్మశ్రీ, పద్మవిభూషణ్ పురస్కారాలకే వన్నెతెచ్చి
పరమేశ్వరుని అనతి పై
అమరపురికేగిన మీరు సదా స్మరణీయులు
మీకివే నా అక్షర నివాళి..!
...............................
సంగీత సామ్రాట్ శివ కుమార్ శర్మ కు అక్షర నివాళి;-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్--విశాఖపట్నం9963265762
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి