చిరంజీవత్వానికి ప్రతీక;-ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్--విశాఖపట్నం-9963265762.
.హనుమద్ జయంతి సందర్భంగా
............................
అంజనీ పుత్రుడు
కేసరి తనయుడు
ఆంజనేయుడు
శ్రీరామభక్తుడు

చతుర్వేద పారంగతుడు
అదిత్యునిచే అనుగ్రహము పొందిన మహానుభావుడు

సుగ్రీవుని ఆనతిచే
శ్రీరామనామ స్మరణచే
అవలీలగా సముద్రసమును దాటి
సీతమ్మ జాడను తెలియచేసిన ధీశాలి

సంజీవనిని తెచ్చి సౌమిత్రుని ప్రాణమును రక్షించిన ప్రాణప్రదాత.
సోదరభరత సమాన అని
శ్రీరామచంద్రుని పరిష్వ0గానికి లోనై
నేటికి రామనామకీర్తనచేయు స్థలమున ఉండే హనుమంతుడు చిరంజీవిత్వానికి ప్రతీక...!
..............................


కామెంట్‌లు