అపర సంగీత సరస్వతి అన్నమయ్య;-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్--విశాఖపట్నం9963265762
చందమామరావే జాబిల్లి రావే అనే పాటతో మాతృమూర్తులు ముద్దులొలుకు తమచిన్నారులకు  గోరుముద్దలు తినిపిస్తు  పాడే మధురమైన పాట అన్నమయ్య కీర్తనే......!!

జో అచ్యుతానంద జో జో ముకుందా లాలి పరమానంద రామగోవిందా అని పిల్లలను ఊయలలో వేసి నిద్రపుచ్చటానికి తల్లులు నేటికి పాడే శ్రావ్యమైన పాట అన్నమయ్య కీర్తనే........!!

బ్రహ్మమొక్కటే పరబ్రహ్మ మొక్కటే అన్న,
బ్రహ్మకడిగిన పాదము అని   తిరుమలేశుని పై అనేకవేల సంకీర్తనలు వ్రాసిన అన్నమయ్య వైశాఖ శుద్ధ పౌర్ణమి పర్వదినాన తాళ్ళపాక గ్రామంలో లక్కమాంబ,నారాయణసూరి  దంపతులకు నోముపంటగా జన్మించెను.
అలివేలుమంగమ్మ స్వప్న ఆదేశానుసారం
"శ్రీ వేంకటేశ్వరశతకం" ను
రచించిన దైవసంభూతుడు.
జీవితాంతం అలివేలుమంగమ్మ, శ్రీనివాసుల  కీర్తనాలకే   అంకితంచేసి ఫాల్గుణ బహుళ ద్వాదశినాడు వారిలో ఐక్యమైన పుణ్యశీలి.
మీ కివే శతకోటి వందనములు......!!
..............................


కామెంట్‌లు