టాటోపం! అచ్యుతుని రాజ్యశ్రీ

ఒకప్పుడు  ఇంగ్లీష్ మీడియం బడులు యూనిఫాంలు లేని రోజులసంగటన !తాతచుట్టూ చేరారు బడిపిల్లలు.ఆయనకు స్వపరభేదం లేదు. అంతాసమానమే!ఆఊరి మోతుబరి మనవడు అస్సలు చదవడు.మహామొండి పెంకెఘటం!ఏరోజూ తాత ఇచ్చిన హోం వర్క్ పూర్తిగా రాయడు చదవడు.ఇష్టం వచ్చినప్పుడు వచ్చి  విసుగు పుట్టగానే మధ్యలో లేచివెళ్లిపోతాడు.అదే క్లాసులో మోతుబరి దగ్గర పనిచేసే గుమాస్తా కొడుకు కూడా చదువు తున్నాడు.తాతగారు చెప్పిన పనులు చేస్తూ  అవ్వగారికి కావల్సినవన్నీ తెచ్చేవాడు.తన స్నేహితులకి తెలీని విషయాలు చెప్పేవాడు. అందరితలలో నాలుకలా ఉండేవాడు. మోతుబరి ఆయన భార్య కూడా వాడి అమ్మతో ఏదైనా వంటపనిసాయంకి పిలిస్తే  శివకూడా వెళ్లి సాయితో ఆడేవాడు. తను చేయని హోం వర్క్ అంతా సాయి  తమగుమాస్తా కొడుకు శివ  అన్న  అహంకారం తో చేయించేవాడు. ఆరోజు  మాష్టారు తాతగారు అందరినోట్సులు చెక్ చేస్తూ "బాబూ శివా!నేను ఇచ్చిన లెక్కలు హిందీ ఇంగ్లీషు ప్రశ్న జవాబులు  ఎందుకు రాయలేదు?"అని ఆశ్చర్యంగా అడిగారు. శివ నాలుక కర్చుకున్నాడు.నిన్న సాయంత్రం  తను నోట్సులన్నీ పూర్తిగా రాసి సాయికి ఇచ్చాడు. వాడు కావాలనే తనవి ఇంట్లో పెట్టి "మాష్టారూ!నేను అన్నీ రాశాను"అని గొప్పగా చూపించాడు."ఓరి!ఇలా రోజు చేసుకుని రావాలి బంగారు తండ్రి!"అని మాష్టారు మెచ్చుకున్నారు. సాయి తనవైపు గర్వంగా చూస్తూ ఉంటే పాపం తలదించుకున్నాడు శివ.కానీ ఇలా మూడు రోజులు శివపుస్తకాలు తీసుకుని కాపీకొట్టి తన ఇంట్లో దాచి వస్తున్నాడు సాయి.ఆరోజు మాష్టారు "ఏంరా శివా!కొమ్ములు మొలిచాయా !?మీనాన్న తో చెప్తా"అని రెండు దెబ్బలు వేయటంతో శివ  లోలోపలే కుమిలి పోయాడు. అసలే అమ్మకు వంట్లో బాగా లేద ని వంట అన్నం ఒక్కటీ వండి తిని ఉతకని మురికి దుస్తులతో వచ్చాడు. నాన్న  పొరుగూరి కెళ్ళాడు.పిల్లలు కిసుక్కున నవ్వారు. ఆసాయంత్రం మాష్టారు తాతగారి ఇంటికి వెళ్లి జరిగిన విషయం చెప్పి భోరుమన్నాడు.సంగతి తెలుసుకున్న ఆయన పశ్చాత్తాపం తో వాడిని బుజ్జగించాడు.శివ తో క్లాసు పిల్లలు మాట్లాడటంలేదు.అంతా సాయి చుట్టూ తిరుగుతున్నారు.రెండు రోజులు శివ కూడా బడికి వెళ్లలేదు  అమ్మకి జ్వరంగాఉంది అని.ఆరోజు బడికి వచ్చిన  శివ ని ఎవరూ పలకరించలేదు.అంతా సాయి చుట్టూ ఈగల్లా ముసిరివాడు ఇచ్చిన  బిస్కెట్లు తినసాగారు.హఠాత్తుగా  మాష్టారు  రెండు  డబ్బాలు పట్టుకొచ్చి  బల్లమీద పెట్టారు. ఒక డబ్బా పైన సొట్టలుపడి నల్లగా మురికిగా ఉంది. రెండో డబ్బా  పూలడిజైన్తో ఆకర్షణీయమైనరంగుతో ఉంది. "ఏడబ్బాని మీరంతా కోరుకుంటారు?"అంతా పొలోమని అరిచారు "ఆపూల రంగుడబ్బా!" కానీ శివ అన్నాడు "మాష్టారండీ!ఆడబ్బా అందంగా ఉంది. కానీ అది ఉట్టి ఖాళీడబ్బా!ఈమురికి డబ్బా  బరువుగా ఉంది. దానిలో బిస్కెట్లు లేదా బిళ్లలు  ఉండిఉంటాయి.నాకు అదే కావాలి. " శివచేత ఆడబ్బా మూత తీయించి  సాయికి అందమైన డబ్బాని తెరవమన్నారు మాష్టారు. ఆశ్చర్యం!శివా డబ్బా నిండా రంగు రంగుల తినే బిళ్లలు!సాయి డబ్బా లో చిత్తుకాగితాలు!"ఏమర్రా పిల్లలూ!పైపై మెరుగులు పటాటోపం చూసి మోసపోయారు.శివ తెలివిగా ఆలోచించాడు. ఇది నిజమైన జ్ఞానం తెలివి!నిన్న వాడిని కొట్టాను.ఏడ్చి ఊరుకున్నాడు.బాధని దిగమింగి తల్లి కి సేవచేసి వచ్చాడు. వాడు పుస్తకాలు పోగొట్టుకున్నాడుట.అందుకే హోం వర్క్ చేయటంలేదుట!"అందరివంకా చూస్తూ మాష్టారు అంటే సాయి  బెదురుతూ తలవంచుకున్నాడు.వాడి పుస్తకాలు  తన దగ్గరే ఉంచుకొని బుకాయించాడు.పాపం శివ వాడిని ఏమీ అనలేడు.ఎందుకంటే తన తండ్రి ఉద్యోగం పోతుంది అని వాడి బాధ! మాష్టారు  తన దగ్గర ఉన్న పాతకాగితాలు కుట్టిన నోట్స్ ఇచ్చి "శివా! ఇక్కడే నీవు హోం వర్క్ చేసి నాకు ఇచ్చి వెళ్లు"అనటంతో  "అలాగేనండీ"అన్నాడు.బలవంతునితో విరోధం తగదు అన్న విషయం  పిల్లలకి తెలుసు మరి🌹
కామెంట్‌లు