శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ శతాధిక కవిసమ్మేళనంలో ఎలయన్స్ కళాశాల విద్యార్ధుల ఘనత

 శ్రీ శ్రీ కళావేదిక ఛైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారి సారధ్యంలో జాతీయ,జిల్లా అధ్యక్షులు మరియూ కార్యవర్గం సమక్షంలో శ్రీ శ్రీ జన్మదినాన్ని పురస్కరించుకుని విశాఖపట్టణం ఆంధ్ర విశ్వవిద్యాలయం అంబేద్కర్ భవన్ లో జరిగిన శతాధిక కవి సమ్మేళనంలో ఎలయన్స్  కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న  విద్యార్ధులు  కలిపిల్లి ఆకాష్, పెద్దట్ల వంశీ, రెడ్డి లక్ష్మిలు కళాశాల తెలుగు అధ్యాపకురాలు యాళ్ళ ఉమామహేశ్వరి ప్రోత్సాహంతో  పాల్గొన్నారు. కవిసమ్మేళనంలో పాల్గొని తెలుగుభాష పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. పలువురి ప్రశంసలు అందుకున్నారు. అందుకుగాను పూలదండ, శాలువా మరియూ మెమెంటో తో చిరు సత్కారం పొమదడం జరిగింది. ఇది వారికి చాలా ఆనందంగా ఉందనీ మునుముందు సమాజహితం కోరే సాహిత్యం వ్రాస్తామని అన్నారు. కుటుంబ సభ్యులు, మిత్రులు ఎలయన్స్ కళాశాల అధ్యాపకుల ప్రశంసలు అందుకున్నారు.
 
కామెంట్‌లు