జోత (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 ఆడుదాం పాడుదాం
అల్లరెంతో చేయుదాం
దూకుదాం గెంతుదాం 
గమ్మత్తెంతొ చేయుదాం 
కుంటుదాం కూలుదాం 
గుంజీలు తీయుదాం 
పట్టుదాం గుంజుదాం 
బలమెంతొ చూసుదాం 
మూయుదాం దాయుదాం
దొంగలాగ నక్కుదాం 
పోరుదాం కోరుదాం
దేవుని జోత ఎత్తుదాం !!

కామెంట్‌లు